Loading

Dheeraj was a 21 year old college going male. Since childhood, he was very keen on getting praises from people and was oversensitive to any criticism from anyone, be it family, friends or teachers.

He thought that he was special and quite different from others and did not require others’ suggestions. He was arrogant towards others and lacked empathy towards their feelings. He thought that he was superior to everyone else, though he had no great accomplishments. He showed excess anger when his mistakes are pointed out and he always thought that he can never do any wrong.

Dheeraj has a lot of narcissistic’ personality traits.

Let us see how such personality traits could bring in conflicts in interpersonal relations, how these traits could have developed and a few tips to overcome them.

The people who are affected by Dheeraj are mostly his immediate family (parents, siblings, spouse)

Some possible reasons behind the traits and problems caused because of these people

  1. Dheeraj was excessively admired and pampered by his mother who never pointed out his mistakes. Even though he made mistakes in childhood, she always supported him.
  2. His father on the other hand was very strict and dominating.
  3. People around him feel uncomfortable in his presence, especially family who finds it helpless to deal with such a person.
  4. Dheeraj will face problems with spouse and also at workplace in future.

Tips to deal with such bouts of narcissism

  • It is really difficult for a person with personality problems to accept his problem but recognize that he might need help.
    1. Though it is difficult to get him for therapy, a mental health professional can do psychotherapy for the individual and help him reduce his interpersonal conflicts . Talk therapy is the best form of therapy. Person talking to Therapist
    2. If he is found to have depression and anxiety, medications can as well reduce his distress.
  • Avoid excess confrontations
    1. Even if the family is confronting him, pointing out his mistakes, the narcissistic person would never accept his mistake.
    2. Better ignore his behavior and do not give much importance to what he says. By doing it you would be saved from a lot of emotional trauma. keep calm
  • Lower your expectations from Dheeraj
    1. Do not expect much emotional support from Dheeraj and later becoming sad that you did not get praises from him. He would not praise you much as he thinks that no one can do better than him and he would feel uncomfortable if someone is praising others in front of him. lower expectations
  • Try to recognize such people from symptoms like – believing that they are special, jealousy, taking advantage of others, manipulative behavior etc.
  • The control is always easier for you than Dheeraj
    1. Dheeraj can be told about his problem but it is rather difficult for him to seek treatment
    2. Understand that though his behavior is not in your control, your behavior to control yourself is in your control. Take care of your emotions and do not give much importance to comments by Dheeraj. Keep calm and control yourself
  • Dheeraj should realize that it is human to make mistakes and he should be ready to accept them.
    1. Accepting his mistake would not make him weak. Keep calm and accept your mistake

      (In Telugu)

      నేనెంతో ‘ప్రత్యేకం’!

ఎప్పుడూ తనని ఎవరో ఒకరు పొగిడితే బాగుండు అనుకునేవాడు అరుణ్‌. చిన్నప్పటినుంచీ అదే భావనతో ఉన్న అతడికి 21యేళ్లు వచ్చినా ఆ లక్షణం పోలేదు. తనని మించిన వాళ్లు మరొకరు లేరనే భావన బలంగా ముద్రించుకు పోయింది మనసులో. అందరిలోకి తాను మాత్రమే ప్రత్యేకం అనుకోవడం కూడా వయసుతో పాటు పెరిగిపోయింది. అసలు ఇలాంటి వ్యక్తిత్వం ఎందుకు అలవడుతుంది? ఎవరు కారణం? దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఎలా బయటపడొచ్చు? ఆ వివరాలే ఈ కౌన్సెలింగ్‌…
ఇంట్లో వాళ్లు, స్నేహితులు, ఉపాధ్యాయులు – వీళ్లలో ఎవరు విమర్శించినా సున్నితంగా స్పందించడం అరుణ్‌కు బాల్యం నుంచీ అలవాటు. ఎప్పుడూతనెంతో స్పెషల్‌ అని, ఇతరులకంటే భిన్నమైన వాడినని, తనకి ఎవరి సలహాలు అక్కర్లేదని భావించేవాడు. ఇటువంటి భావనల వల్ల ఇతరులతో చాలా పొగరుగా వ్యవహరించేవాడు. ఎదుటి వారి మనోభావాల పట్ల ఏమాత్రం సహానుభూతి ప్రదర్శించేవాడు కాదు. గొప్పగా తను చేసిందేమీ లేకపోయినప్పటికీ అందరికంటే ఉన్నతమైన వ్యక్తిని అనుకునేవాడు. తన తప్పుల్ని ఎత్తి చూపితే మాత్రం విపరీతమైన కోపం వచ్చేసేది. తానెన్నటికీ తప్పు చేయనని దృఢంగా నమ్మేవాడు. అరుణ్‌ ప్రవర్తన వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవితభాగస్వామి.
కారణాలేంటంటే

  •  అరుణ్‌ ఇలా తయారవడానికి అతడి తల్లే కారణం. చిన్నప్పట్నించీ అరుణ్‌ ఏంచేసినా విపరీతంగా ప్రశంసించడం, గారాబం చేయడం, తప్పుల్ని ఎత్తి చూపించపోయేవారు కాదు. ఒకవేళ అరుణ్‌ ఏదైనా తప్పు చేసినా అతడికే సపోర్టుగా ఉండేవారు.
  •  ఇక తండ్రిని చూస్తేనేమో అతను మహా స్ర్టిక్ట్‌. విపరీతంగా అధికారం చెలాయించేవాడు.
  •  అరుణ్‌ వల్ల చుట్టుపక్కల ఉండేవాళ్లు అసౌకర్యంగా ఉండేవారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఇతగాడితో వ్యవహారం ఇబ్బందిగా ఉండేది.
  • ఇకమీదట భవిష్యత్తులో జీవిత భాగస్వామి, పనిప్రదేశంలో సహోద్యోగులతో అరుణ్‌ సమస్య ఎదుర్కోవాల్సి రావడం ఖాయం.

వ్యవహరించడం ఇలా

  •  వ్యక్తిత్వ పరంగా సమస్య ఉన్నవాళ్లు తమకో సమస్య ఉందనే సత్యాన్ని అంగీకరించరు. తనకో సమస్య ఉందని అంగీకరించకపోయినా పర్వాలేదు కాని అటువంటి పరిస్థితికి సాయం అవసరం అనే విషయాన్ని గుర్తించేలా చేయాలి.
  •  కష్టమే అయినప్పటికీ మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లగలిగితే సైకోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు. మానవ సంబంధాల్లో ఇబ్బందులు రాకుండా చికిత్స చేస్తారు. దీనిలో కూడా టాక్‌ థెరపీ బాగా పనిచేస్తుంది.
  •  డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటివి ఉంటే కనుక మందులు వాడితే తగ్గిపోతాయి.
  •  కుటుంబ సభ్యులు తమ తప్పుల్ని ఎత్తి చూపుతుంటే వ్యక్తిత్వ లోపం ఉన్న వాళ్లు వాటిని అంగీకరించరు.
  •  అందుకని అరుణ్‌ ప్రవర్తనను చూసిచూడనట్టు వదిలేయాలి. అతను చెప్పే మాటలకు ప్రాముఖ్యత ఇవ్వొద్దు. ఇలా చేయడం వల్ల మీ మనసుకు ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకోవచ్చు.
  •  అరుణ్‌ దగ్గర్నించి మానసికంగా ఆదరణ లభిస్తుందని మీరు ఊహించొద్దు. ఒకవేళ అలాంటి భావనలు ఉంటే కనుక అతడి వద్ద నుంచి మెచ్చుకోలు రానప్పుడు మీరే బాధపడతారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు ఇతరుల్ని మెచ్చుకోవడం అనేదే ఉండదు. ఎందుకంటే తనకంటే గొప్పవాళ్లు మరొకరు లేరనే భావనలో ఉంటాడు కాబట్టి. అలాగే అతగాడి ముందు మరెవరినైనా పొగిడితే అసౌకర్యంగా భావిస్తారు.
  •  ఇటువంటి వాళ్ల లక్షణాలను గుర్తించే ప్రయత్నం చేయండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే… తామెంతోప్రత్యేకం, ఈర్ష్య, తమ ప్రయోజనం కోసం ఇతరుల్ని వాడుకోవడం వంటివి చేస్తుంటారు.
  •  అరుణ్‌ని అదుపు చేయాలని చూడడం కంటే కూడా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అదెంలో సులభం కూడా.
  •  అరుణ్‌ తన సమస్య గురించి బయటకు చెప్పే అవకాశం ఉంది. కాని చికిత్స తీసుకోవడం మాత్రం కష్టమే.
  •  అతగాడి ప్రవర్తన మీ అదుపులో లేదనే విషయం తెలిసిన విషయమే కాబట్టి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. అరుణ్‌ మీ గురించి చేసే వ్యాఖ్యలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరంలేదు.
  •  మనుషులన్నాక తప్పులు చేయడం సహజం అనే విషయాన్ని అరుణ్‌ గ్రహించాలి. వాటిని అంగీకరించేందుకు సిద్ధపడాలి. తన తప్పుల్ని తాను అంగీకరించడం వల్ల తానేమీ బలహీనం అయిపోడు.

ఈ ప్రపంచంలో మనకంటే బెటర్‌గా ఉండేవాళ్లు ఉంటారనే విషయాన్ని గ్రహించగలగాలి. అలాగే తప్పులు చేస్తుంటామనే విషయాన్ని అంగీకరించాలి. చేసిన తప్పుల్ని అంగీకరిస్తూ జీవితంలో ముందుకు వెళ్లడానికి మించింది మరోటి లేదు. అలాగే ఇతరులు ఏదైనా సాధించినప్పుడు వాళ్లని మెచ్చుకోవాలి. విశాలమైన విశ్వంలో మనం ఓ చిన్న రేణువులాంటి వాళ్లం. అందుకని ‘నన్ను మించిన వాళ్లు లేర’నే భావన వద్దేవద్దు. చివరగా చెప్పేది ఒకటే మనిషి సంఘజీవనే విషయం గుర్తుంటే చాలు.

Dr Jyothirmayi is a Psychiatrist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top