Loading

Gowri was newly married and though initially everything was going smoothly, she faced criticisms from her in-laws and even her husband. She tried explaining them but there were always comments and eventually she could do nothing about it. She felt helpless and hoped that her husband and in-laws could be more understanding but it never happened. She could do nothing about it.

Sometimes not only Gowri, but many of us face situations at school, work, home, etc., where in we feel helpless about it and lack problem solving capacity.

Let us know the reasons behind it.

  1. People might feel helpless if the situation is not in their hands. For example, the behavior of husband and in-laws is not in the hands of Gowri.
  2. A person who is always dependent on other people might feel helpless whenever faced with stress. For example, Gowri was dependent for most of her wants on her parents and friends. She could not handle situations on her own.
  3. A person who is suddenly put in a new situation. For example, Gowri was brought up in an atmosphere where most of them appreciated her and suddenly she was put in a place where people were criticising her. She did not know what to do.

Here is how Gowri could handle it.

  • Gowri should understand that there are other people out there facing similar situations and she is not all alone. If needed, she can learn from those people by talking to or observing them. You are not alone
  • Gowri should analyse and discuss with a friend if needed about the main problems, her fears, main areas of difference with in laws, reasons of their commenting etc. She should also be highlighting the positive things after marriage. 
Talk to your friends, who you think are affected by physical abuse.
Link to Post: Talking is the best form of Therapy
  • Do not think thatI can never get out of this mess’, Gowri should realise that she might not find solutions as per her expectations, but certain modifications can definitely be made. There is always a way out
  • Develop a feeling that you are strong and capable of solving problems. Gowri should stop believing that only her parents and friends can solve her problems. She can surely discuss with them but should be independent in finding solutions as well. Stop believing that you are weakYou are not weak
  • Gowri should appreciate herself more for all the things she has been doing after marriage. She should not solely depend on other people for appreciation and that is one of the reasons she feels helpless when they criticise her. Appreciate Yourself

Feelings of helplessness are feelings only. Just feeling helpless does not mean you will not find help anywhere. It only means that you have given up. Do not give up. Life is a battle for all of us. Remember that no one has a smooth ride.

If things go overboard, one can always seek family counselling if required.


(In Telugu Language)

 

నిస్సహాయత ఓ భావన మాత్రమే!

పెళ్లయిన కొన్ని రోజుల వరకు గౌరి జీవితం సాఫీగానే సాగింది. అయితే మొదటి నుంచీ అత్త, భర్త ఆమె చేసే పనులని విమర్శించేవారు. అయితే తను చేసిన పని గురించో, మాట్లాడిన విషయం గురించో వాళ్లకి వివరించాలి అనుకునేది. కాని అందుకు కూడా మాటలు పడాల్సి వచ్చేది. దాంతో ఆ ప్రయత్నమే మానేసింది. చివరికి నిస్సహాయంగా ‘నేనెందుకు పనికిరాను’ అనే భావనలో మిగిలిపోయింది. 
గౌరి విషయంలోనే కాదు మనలో కూడా చాలామందికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అవెలాగుంటాయంటే నిస్సహాయంగా నిలిచిపోవడంతో పాటు సమస్యని పరిష్కరించే సామర్థ్యం మనలో లేదా అనే అనుమానం కలుగుతుంది చాలాసార్లు. అసలు ఇలాంటి భావనలు తలెత్తడానికి కారణాలేంటి…

  •  పరిస్థితి చేయిదాటి పోయినప్పుడు నిస్సహాయంగా ఉండడం అనేది సహజం. ఉదాహరణకి గౌరి భర్త, అత్తమామల ప్రవర్తన అనేది ఆమె చేతిలో ఉన్న విషయం కాదు. అందుకే ఆమెలో ఆ భావనలు తలెత్తాయి.
  •  ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడే వాళ్లు ఏ కాస్త ఒత్తిడికి గురయినా నిస్సహాయులైనట్టు భావిస్తారు. గౌరి తన పెళ్లికి ముందు తల్లిదండ్రులు, స్నేహితులమీద ఆధారపడేది. దాంతో సొంతంగా పరిస్థితులని చక్కదిద్దే సామర్థ్యం లేకుండాపోయింది ఆమెకి.
  •  ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అలా మారిపోయే అవకాశం ఉంది. పెళ్లికి ముందు గౌరి చుట్టుపక్కల ఆమెను ఎప్పుడూ మెచ్చుకునే వారే ఉండేవారు. పెళ్లితో ఒక్కసారిగా విమర్శించే వాళ్ల మధ్యకి రావడంతో ఆమెకేం చేయాలో అర్థంకాలేదు.

బయటపడే బాట

  •  ఈ చిక్కు పరిస్థితి నుంచి ఎన్నటికీ బయటపడలేను అనుకోవద్దు. గౌరి విషయంలో ఆమె ఊహించిన విధంగా సమస్యకు పరిష్కారం దొరక్కపోవచ్చు. కాని అసలు పరిష్కార మార్గాలే లేకుండా పోలేదు.
  •  తన సమస్య గురించి స్నేహితురాలితో మాట్లాడొచ్చు. తనలోని భయాలు, అత్తగారింట్లో ఎటువంటి సందర్భాల్లో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. వాళ్లు విమర్శించడం వెనక కారణాలేంటి వంటి విషయాల్ని మనసుకి దగ్గరగా ఉండే స్నేహితులతో పంచుకోవచ్చు. దాంతో పాటు పెళ్లయ్యాక ఆమెకు ఎదురైన సానుకూల విషయాలను గుర్తు తెచ్చుకోవాలి కూడా.
  •  సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం, ధృఢచిత్తం తనలో మెండుగా ఉన్నాయనే భావనను పెంచుకోవాలి. స్నేహితులు, తల్లిదండ్రులు మాత్రమే తన సమస్యలను పరిష్కరించగలరు అనే ఆలోచన నుంచి గౌరి బయటపడాలి. వాళ్లతో చర్చిండం వల్ల నష్టంలేదు కాకపోతే స్వతంత్రంగా సమస్యల్ని పరిష్కరించుకునే స్థితికి చేరుకోవాలి. మిమ్మల్ని మీరు బలహీనులు అనుకునే ఆలోచనలకు వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.
  •  తానొక్కతే కాకుండా తనలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వాళ్లు మరెందరో ఉన్నారనే విషయాన్ని గమనించాలి. అవసరమైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లతో మాట్లాడి లేదా పరిశీలించి నేర్చుకునే ప్రయత్నం చేయయాలి.
  •  పెళ్లి తరువాత తాను చేసిన పనులను తానే మెచ్చుకోవాలి. అంతేకాని వేరే వాళ్లు మెచ్చుకోలు కోసం ఎదురుచూడొద్దు. అవతలి వాళ్ల మెప్పు కోసం ఎదురుచూసినప్పుడే వాళ్లు విమర్శించినప్పుడు నిస్సహాయతతో కూడిన భావన కలుగుతుంది.

నిస్సహాయులం అనేది కేవలం భావన మాత్రమే. నిస్సహాయత అనే భావన కలిగిందంటే ఇక మీకు సాయం చేసేవాళ్లు ఎవరూ లేరని కాదు. ‘నా వల్ల ఇంకా ఏమీ కాదు అనుకోవద్దు’ అనే ఆలోచన వద్దే వద్దు. మానవులందరికీ జీవితం అనేది యుద్ధం. యుద్ధం చేయకుండా ఎవరి జీవితం సాఫీగా సాగిపోదు. ఒకవేళ ఇలా ఆలోచించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోతే నిపుణుల సాయం తీసుకోవడంలో తప్పులేదు.

 

Dr Jyothirmayi is a Psychiatrist

One thought on “Overcoming Helplessness | నిస్సహాయత ఓ భావన మాత్రమే!

  1. medam garu namaskaramulu. face book , gmail, dwara maku enthagano me salahalu , suchanalu vupayogapaduthunnayi. maku chala anadhamugavundi.me suchanalu chadivinatharuvatha sagam bayam kudina stress pothundi
    . study lo faily ayina tharuva tha nenu endhuku panikiranu anebavana nalo chalakalam vundipoyindi
    adhi depression ga maripoyindi .me tho na abiprayam panchukovadam chala relifegavundi . very very thanksmedam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top